17/11/2026, Tuesday · 07:57:48 PM About UsPrivacy PolicyContact Us
Aksharavijetha News
AksharaVijetha News

This is Short News — best viewed on mobile.

News ePaper
Punnam Sambasivarao
Managing Director
20 days ago

20,21వ వార్డుల సచివాలయాలలో పేర్ల ప్రదర్శన ఫై చర్చ ...!!

21వ వార్డు సచివాలయంలో చైర్మన్ పేరుతో పాటు ఆమె భర్త పేరు ప్రదర్శించగా, కౌన్సిలర్ పేరు మాత్రమే ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా పేర్లు ఏర్పాటు చేయడానికి గల నిబంధనలు, కారణాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. విజేత న్యూస్ | ప్రజల గొంతుకగా.. నిజానికి నిదర్శనంగా..

Punnam Sambasivarao
Managing Director
20 days ago

మెజారిటీలో అధిక్యం, ప్రయారిటీలో సూన్యం ...!!

మెజారిటీలో ఆధిక్యం.. ప్రయారిటీలో శూన్యం! * ​కల్వకుర్తి బల్దియాలో చట్టాన్ని వెక్కిరిస్తున్న ‘పతుల’ పెత్తనం * 22 వార్డుల్లో 12 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నా సాగుతున్న ‘షాడో’ పాలన * వార్డు ఆఫీసు బోర్డులపైనా మహిళా నేతల పేర్లకు తోకలా భర్తల పేర్లు * అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ భర్తల హవా.. చేతులు కట్టుకుని ప్రేక్షక పాత్రలో మహిళా కౌన్సిలర్

Punnam Sambasivarao
Managing Director
20 days ago

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ (Cyclone Arnab) అతి తీవ్ర తుఫాన్ ఆంధ్రప్

పల్నాడు జిల్లా, గుంటూరు, సత్తెనపల్లి పరిస్థితి మీకు ముఖ్యమైన పల్నాడు ప్రాంతం విషయానికి వస్తే, తుఫాన్ తీరాన్ని దాటిన తర్వాత దాని ప్రభావంతో అంతర్గత జిల్లాల్లో కూడా వర్షాలు, గాలులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సత్తెనపల్లి, రాజుపాలెం, నరసరావుపేట ప్రాంతాలకు ప్రస్తుతం ఎంత వర్షం పడుతోంది, ఏ మండలానికి ఎంత ప్రమాదం ఉందనే తాజా ధృవీకరించిన

Punnam Sambasivarao
Managing Director
31 days ago

రైతుపై మళ్లీ భారం.. భూమి శిస్తు వసూలుకు మంత్రి పొంగులేటి

నాలుగు దశాబ్దాల క్రితం రైతులకు భారంగా మారిన భూమి శిస్తును ఎన్టీఆర్‌ 1984లో రద్దు చేశారు. శిస్తు చెల్లించలేక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికారుల వేధింపులు చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ భూమి శిస్తు వసూలుకు సిద్ధమవుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Punnam Sambasivarao
Managing Director
31 days ago

ఏషియన్ గేమ్స్ హీరోలకు మోదీ నినాదం.. మనం చేసి చూపిద్దాం!

ఆసియా క్రీడల్లో సత్తాచాటిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. “మనం చేసి చూపిద్దాం” అంటూ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. భారత్‌ను ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలపడమే లక్ష్యమన్నారు. క్రీడాకారుల విజయాలను అభినందిస్తూ, కోచ్‌లు, సహాయక సిబ్బంది కృషిని కొనియాడారు.

Punnam Sambasivarao
Managing Director
31 days ago

రాష్ట్రపతికి మంగళగిరి చీర, ఏటికొప్పాక బొమ్మ బహూకరించిన లోకేశ్

మంత్రి నారా లోకేశ్ విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఆంధ్రప్రదేశ్ చేనేత వైభవానికి ప్రతీకగా మంగళగిరి చీర, హస్తకళలకు గుర్తింపుగా ఏటికొప్పాక లక్క బొమ్మలను బహూకరించారు. దసరా ఉత్సవాలు, జాతీయ సరస్ మేళాలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

Punnam Sambasivarao
Managing Director
31 days ago

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు వీఐపీ, సిఫార్సు దర్శనాలను రద్దు చేశారు. ఉచిత దర్శనానికి మాత్రమే అనుమతిస్తూ భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Punnam Sambasivarao
Managing Director
31 days ago

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,47,430గా, 22 క్యారెట్ల ధర రూ.1,35,140గా నమోదైంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలో రూ.2,29,900కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,47,580గా ఉంది. ధరలు మారే అవకాశం ఉండటంతో కొనుగోలు ముందు తాజా రేట్లు పరిశీలించాలి.

Punnam Sambasivarao
Managing Director
31 days ago

ఏఐ వార్మ్‌లతో ప్రపంచానికి ముప్పు.. నిపుణుల హెచ్చరిక!

ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాల్లోకి చొరబడి, వాటి నుంచి ఇతర పరికరాలకు వ్యాపించే ఏఐ వార్మ్‌లపై ఆంథ్రోపిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఐఓటీ పరికరాలను ఇవి లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపారు. స్వయంగా వ్యాపించే సామర్థ్యం కలిగిన ఈ ముప్పు సైబర్ భద్రతకు సవాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Punnam Sambasivarao
Managing Director
31 days ago

ఢిల్లీలో ధర్నాలతో రూ.2,000 కోట్ల నష్టం.. కోర్టును ఆశ్రయించిన వ్యాపారి!

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో నిరసనలతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని రెస్టారెంట్ యజమాని ఆయుష్ చోప్రా హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 10న జరిగిన ఆందోళనతో కన్నాట్ ప్లేస్‌లో రూ.150–200 కోట్లు, ఢిల్లీ వ్యాప్తంగా రూ.2,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధ్యుల నుంచి పరిహారం ఇప్పించాలని కోరగా, విచారణను 27కు కోర్టు వాయిదా వేసింది.