పల్నాడు జిల్లా, రాజుపాలెం:పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం మూడు స్థానాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని వైసీపీ నాయకులు వెల్లడించారు.నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కూటమి అభ్యర్థులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాలని వారు కోరుతున్నట్లు తెలిపారు.